Pages

Saturday, February 1, 2014

Manishi

ఓ మనిషి! నీవొక ఋషివి!
ఓ మనీషి! నీవొక ఋషివి!!
ప్రాణి కోటికి లేనిది
నీకున్నది బుద్ధి, జ్ఞానం, వివేకం
కూడు గుడ్డ నీడకై నీవుపడే పాట్లు అనిర్వచనియం
తరిగిపోని ఆస్తి తరతరాలకు అందించాలనే నీ అత్యాశ వ్యసనం
ఏది సత్యం, ఏది నిత్యం తెలుసుకోవాలని ప్రయత్నించు
బాహ్యానందం కోసం పరుగులెడుతూ అంతరాత్మ ఘోషను విస్మరిస్తూ
నీ భావితరాలకు అందించగలిగిన విలువలను మరస్తూ మారుస్తూ
ఎందాక నీ పయనం? నీంగికి ఎగసేవా? పాతాళం అంతు చూసేవా?
నీలో రగిలే ఈర్ష, ద్వేషం, అసుయ పగలకు ఆజ్యం పోస్తూ.....
నీవు పుట్టినప్పుడు నీలోని నిర్మలత, ప్రశాంతత ఏది?
ఎదుగుతు అంటి తెచ్చి పెట్టుకున్నవే
సమరం లో ఆయుధాలని భ్రమిస్తివా!!
తిరిగి నీ గూడు చేరుతూ
నీతో వచ్చేదేమిటో తెలుసుకో!!!!!

No comments:

Post a Comment