Pages

Wednesday, March 26, 2014

పొద్దున లేస్తే దేశం తగలడిపోతుంది.....రాష్ట్రం నాశనం అయిపోతుంది అని తెగ ఫీల్ అయిపోయి ..... ఈ దేశం ఎమయిపోతుందో అని పేపర్ చదువుతా ఫీల్ అయిపోయి ఆఫీస్ కి వెళ్ళగానే ఆఫీస్ రాజకీయలతో ఆఫీస్ ని బాగు చెయ్యటం నా వల్ల కాదు అని ఫీ అయిపోయి కాంటీన్ లో వాడి మీద వీడు వీడి మీద వాడు చెప్పేది విని ఎంటర్తైన్ అయిపోయి సాయంత్రం ట్రాఫిక్ ని రాజకీయల్ని తిట్టేసుకుని ఇంటికి వచ్చాక మళ్ళి ఈ దేశాన్ని బాగు చెయ్యటం నా వల్ల కాదు అని నీలిగేసి పడుకుండి పోతాం.

అసలు రాజకీయలు అంటరానివి అన్నట్టు, రాజకీయం మనకి సంబందమే లెనట్టు, అసలు రాజకీయం ఫాలో అయ్యే వాడు మాట్లాడే వాళ్ళు దేశ ద్రోహులు అన్నట్టు చుస్తున్నారు. అసలు రాజకీయం లేకుండా దేశం నడవదా? అని అడిగేవాళ్ళు ఉన్నారు.... ఇక్కడ సమస్య ఏంటి అంటే రాజకీయ నాయకుల వల్ల దేశం నాశనం అయ్యింది కరెక్టే కాదు అనను నేను. కాని ఆ రాజకీయ నాయకులని ఎన్నుకునేది ఎవరు? మనమే గా......

ఎలక్షన్ రోజు శెలవిచ్చి ఓట్లు వెయ్యండ్రా అంటే బిర్యాని తెచ్చుకుని తిని టి వి లో చూస్తూ పోలింగ్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, దేశం నాశనం అవుతుంది అని మళ్ళీ వర్రీ అయిపోతాం...ఓట్ వెయ్యాలి అంటే ఎండ గా ఉంది......లైన్ ఎక్కువ గా ఉంది.....అసలు నాకు ఓట్ లేదు అనేసి మళ్ళి దేశం నాశనం అయిపోతుంది అని ఫీల్ అవుతున్నాం.

నా కులం కాబట్టి జెయిల్ కి వెళ్ళి వచ్చినా ఓ కే, నా మతం కాబట్టి పక్క మతం మీద మత దాడులు చేసిన ఆల్రైట్ అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటి అంటే నాయకుడు కాదు, ఓటర్స్. చదువుకోని వాడు మందు కి మని కి లొంగుతున్నాడు, చదువుకున్న వాడు ఈ రాజకీయాల వల్ల ఉపయోగం లేదు అని వదిలేస్తున్నాడు.

ఓట్ అనేది బ్రహ్మాస్త్రం అని గుర్తించండి, మనం వేసే ఒక్క ఓట్ అవినీతి పరుల గుండెల్లో పోటు కావాలి. ఉన్నంత లో మంచి కాండిడేట్ ని ఎన్నుకోండి. ఇప్పుడు ఉన్న రాజకీయనాయకుల్లో మంచి వాళ్ళు దొరక్క పోవచ్చు,కాని ఉన్నంత లో ఒకడిని ఎన్నుకోండి. ఆ ఎన్నుకునే ఒకడు నిజం గా గవర్నమెంట్ ఫాం చేసే కెపాసిటి ఉండాలి, గెలవరు అనుకున్న వారికి కాకుండా గెలిచే వారిలో మంచి వాడిని వెతకండి. ఓట్ చెయ్యండి. మీ ప్రతి ఓట్ ముందుకెళ్ళాల్సిన దేశానికి ఇంధనం అని గుర్తించండి

జై భారత్ !! జై తెలుగు దేశం !! జై చంద్ర బాబు !! జోహర్ ఎన్ టి ఆర్ !!

just wrote it for my dear friend Aruna Devi for her show — with Ravi Vasireddi and 18 others.