Pages

Thursday, February 13, 2014

sthree

ఓ బంగరు తల్లి

ఏడువకు ఏడువకు నీ కన్నీరు వృ ధా కానివ్వకు?
పురిటిలొనె వరిగింజతో కాటికంపె అనాగరికత మనదనీ
త్రుళ్లుతు కేరింతలతో ఎదుగుతుంటె చిదిమేసె మృగాలున్నారని
పాదాల పారాణి ఆరకనే నిప్పంటించె ఆటవిక మనుష్యులన్నారని
అడుగు బయటపెడితె తిరిగింటికొచ్చెదాక వెంటాడి వెధించె కళ్లెన్నో చె్తులెన్నో నని
ఏడువకు ఏడువకు నీ కన్నీరు వృ ధా కానివ్వకు?


అబలవు కాదు ,సబలవని పోరాడు?
నీ బలం బలహీనతలనెంచి  మసలుకో
కట్టుబాట్లు, ఆచారాలనెంచి నీ కనుగుణం గా మలచుకో
నీ ఉనికి కే ప్రమాదకారంగా మారిన ఈ తరుణం లో
స్త్ర్రీ స్వేచ్చా  కై  సమానత్వం కై ఉపక్రమించు,
కాళి వై ,అపర  మహంకాళి వై స్వైర విహారం గావించు!

ఏడువకు ఏడువకు నీ కన్నీరు వృ ధా కానివ్వకు?






No comments:

Post a Comment