Pages

Thursday, February 13, 2014

sthree

ఓ బంగరు తల్లి

ఏడువకు ఏడువకు నీ కన్నీరు వృ ధా కానివ్వకు?
పురిటిలొనె వరిగింజతో కాటికంపె అనాగరికత మనదనీ
త్రుళ్లుతు కేరింతలతో ఎదుగుతుంటె చిదిమేసె మృగాలున్నారని
పాదాల పారాణి ఆరకనే నిప్పంటించె ఆటవిక మనుష్యులన్నారని
అడుగు బయటపెడితె తిరిగింటికొచ్చెదాక వెంటాడి వెధించె కళ్లెన్నో చె్తులెన్నో నని
ఏడువకు ఏడువకు నీ కన్నీరు వృ ధా కానివ్వకు?


అబలవు కాదు ,సబలవని పోరాడు?
నీ బలం బలహీనతలనెంచి  మసలుకో
కట్టుబాట్లు, ఆచారాలనెంచి నీ కనుగుణం గా మలచుకో
నీ ఉనికి కే ప్రమాదకారంగా మారిన ఈ తరుణం లో
స్త్ర్రీ స్వేచ్చా  కై  సమానత్వం కై ఉపక్రమించు,
కాళి వై ,అపర  మహంకాళి వై స్వైర విహారం గావించు!

ఏడువకు ఏడువకు నీ కన్నీరు వృ ధా కానివ్వకు?






Friday, February 7, 2014

funny write-up


"నీవు అంత దగ్గరగా నిలుచుంటె ఊపిరి అందటం లేదు తెలుసా"
"మరి ఇప్పుడు"
"ఇంకా"
"దూరమా , దగ్గరా"
"అర్థం చేసుకో"
"మరే, ఇదిగో"
"చెప్పాగా touch అవ్వకుండా  అయితే OK"
"తెలుసు"
"అదేగా"
"ఇంకా"
"ఇంకానా"
"ఎంత"
"ఎంతైనా"
"మనమేమైనా మనుష్యులమా"
"అబ్బ, తెలుసు"
"వాళ్లకన్నా మనమే  better "
"అంతేనంటావా?"
"అంతేమరి"...

Guess who is it?
:
:
:
:
:
:
:
:
:
:
Data transfer between 2 says OK..

Saturday, February 1, 2014

kaala chakram

జీవితమనె చదరంగం లో నెను ఒక పావు ను కాదు ఆడె ఆటగాడిని కావలని చూసా,
గెలవాలని చూసా ,ఆశకు హద్దులు గీసి ,కోరికలకు కల్లెం వేసి ఆనందం అనె గెలుపు కై ఎత్తుకు పై ఎత్తులు వేసా,కాని నీవు నా వెనుక వెర్రిదానా నెను నీవు ఆడిథె నెను ఆడటం లెదు అనె ఓ వెర్రి నవ్వు నవ్వావు ! గెలుపు అందుకొన్నానని సంతోష పడెలోపె సుడిగుండాల చక్రవ్యుహంలూకి నెట్టేస్తున్నావు ! సెద తీరుదమని కాసెపు విశ్రమిస్థె రెప్పపాటులూ చెజారిపొతున్న కాలాన్ని చూపిస్థు వెక్కిరిస్తావు, అలసిపొథున్నా శరీరానికి ఆయువు పొసి గమ్యం వైపు అడుగులెద్దమని పయనిస్థె ఎండమావి లాగా ఊరిస్తావు, ఇలా కాదని నీవెమిటొ తెలుసుకుందామని అంటె మహా మహులకె అంతుచిక్కని అనంతాన్ని నీవెంత అంటావు! అలసిపొయా ఓడిపొయానని ఆడటం మానెస్తానంటె తుది దాక ఆడవలసిందెనన్న ఆట నియమాన్ని చూపిస్తావు ?

yuvatha-chaduvu

ఖరీదైన చదువుల్లో ఏమి లేదురా!!
వంద మార్కులు నీ తెలివికి కొలమానం కాదురా!
నిరుత్సహ పడకు నిర్విర్యం చెందకు
నీవనుకుంటే సాధించలేనిది ఏదీ లేదురా!!
గుండెల్లో ధైర్యాన్ని నింపి అడుగు ముందుకు వేయ్యి
ఈ CET లు ఏమి చేస్తాయి, MAT లు ఏమి చేస్తాయి,
నీలో సృజనాత్మకతను పెంపెందించు
క్రొత్తగా ఆలోచించు క్రోంగొత్తవి రూపొందించు
 
జీవితం రంగుల కల అని
కలలోనే ఉండిపోకు
ఆ కలలను సాకారం చేసే దిశగా ప్రయత్నించు
ఆశ నిరాశల వలయంలో చిచ్చు కొని అల్లాడీపోకు
వయసు, ప్రేమ, మాయ, మోహం లో పడిపోకు
నీకు నీవే సాటి రా లేదు నీకు పోటి రా
నీ శత్రువు ఎవరో కాదురా నీలోని భయమురా!!!

Manishi

ఓ మనిషి! నీవొక ఋషివి!
ఓ మనీషి! నీవొక ఋషివి!!
ప్రాణి కోటికి లేనిది
నీకున్నది బుద్ధి, జ్ఞానం, వివేకం
కూడు గుడ్డ నీడకై నీవుపడే పాట్లు అనిర్వచనియం
తరిగిపోని ఆస్తి తరతరాలకు అందించాలనే నీ అత్యాశ వ్యసనం
ఏది సత్యం, ఏది నిత్యం తెలుసుకోవాలని ప్రయత్నించు
బాహ్యానందం కోసం పరుగులెడుతూ అంతరాత్మ ఘోషను విస్మరిస్తూ
నీ భావితరాలకు అందించగలిగిన విలువలను మరస్తూ మారుస్తూ
ఎందాక నీ పయనం? నీంగికి ఎగసేవా? పాతాళం అంతు చూసేవా?
నీలో రగిలే ఈర్ష, ద్వేషం, అసుయ పగలకు ఆజ్యం పోస్తూ.....
నీవు పుట్టినప్పుడు నీలోని నిర్మలత, ప్రశాంతత ఏది?
ఎదుగుతు అంటి తెచ్చి పెట్టుకున్నవే
సమరం లో ఆయుధాలని భ్రమిస్తివా!!
తిరిగి నీ గూడు చేరుతూ
నీతో వచ్చేదేమిటో తెలుసుకో!!!!!

yuvatha

యువత దేశ భవిత నీదిరా!
యువతా దేశ భవత నీదేరా!!
బాపూజి కలలు కనిన మవ సమాజ నిర్మాణం ఏదిరా?
కుటిల, కుల, రాజకీయాలకు బలి ప్శువు కాబోకు!
కులయుభ్వవించింనది జీవనభృతికని తెలుసుకో
కులచత్రంలో ఇరుక్కొని దేశాహుతిని రగిలించకు
పాత తర అసమానతలను రూపుమాపుటకు
ప్రయత్నిస్తూ భావితరాలకు విస్తరించిన
నీ ఆలోచన పరిధిని అందించు
కుల మాత ప్రాంత జాతి విభేదాలకు అతీతంగా మసులుకో
దేశ విదేశాలలో నీ భారతమాత ఖ్యాతి వెలుగెత్తి చాటు!!!!

bandham

ఎవరు ఎపుడు కలుస్తారొ
ఎవరు ఎపుడు విడిపోతారో
ఏ బంధం ఎటు పొతుందో
ఏవరి తో ఈ రుణనుబంధమో
అన్ని ప్రశ్నలె?,సమాధానికై ఎదురు చుడకు నెస్తం!
ప్రవహించె నది గమ్యం సంద్రమె
ఎగిసిపడె అల గమ్యం సంద్రమె
ప్రతి ఒక్కరు చెరవలసినది ఈ జగన్నాటక సూత్రధారి అయిన పరమాత్ముని దరికె ....