Pages

Monday, August 27, 2012

life in US beautiful/ colorful in india

hmmm ...ఎందుకలా అన్నానంటే ?

Wood houses ప్రకృతి ఇక్కడంతా అందంగా ఎవరో చేక్కరేమో అన్నట్టు  ఉంటుంది. జనాలు అలానే maintain  చేస్తుంటారు.

ఒకప్పుడు USA అంటేనే Dream Come True. Ofcourse ఇప్పటికి visit  చెయ్యని వాళ్ళకు అంతే.
నా last 5 years లో US/CANADA/INDIA అంత కలిపి -36 degrees of celsius to  +48 degrees of celcius
చూసాను .అన్ని రకాల నానాజాతి సమితి వాళ్ళను చూసాను . ఒక గృహిణి గా అటు ఇండియా ఇటు అమెరికా అటు కెనడా ను కలుపుకుంట మధ్య మధ్య లో లండన్ , GERMANY ను touch  చేస్తూ నా జీవిత ప్రయాణాన్ని సాగించాను . కొత్త గా పెళ్లి కూతరు గా , గర్భినిగా, చంటి బిడ్డకు తల్లిగా , మరీ చనిద్దరు పిల్లల తల్లిగా ఒంటరిగా ప్రయాణం చేస్తూనే ఉన్నాను . నాలో మార్పు ఉంది కాని airports లో కాని నా co-travellers లో కాని మార్పు లేదు.అమాయకమయిన మొహాలు కొన్ని అయితే reserved faces  కొన్ని.కొంతమందిని fun to be watch.
నేనేమో నా గోల నాది  అన్నట్టు నా పరుగు లో నేనుంటాను.

జీవితం అంటే నేమో ఎవరి గమ్యము ఈ వైపుంది ఎవరికీ ఎరుక ? ఈ దారి ఎటు పోతుందో పరమత్మునికేరుక. ఎప్పుడు flight ఎక్కినా నా గమ్యం సరిగ్గా చేరుతానో లేదోనని భయం వెన్నట్టు ఉంటూనే ఉంది. జీవితం అంటే ఇంతే కదా. కిటికీ లో నుండి చూస్తే అంత మంచే, అంత సముద్రమే , అంత పర్వతాలే. నేను ఎంత ఈ అనంత విశ్వం లో ఇసుమంత రేనువును అదీ కూడా కానేమో. ఈ కట్టి ఎక్కడైనా రాలిపోవచ్చు. మేఘాల మధ్య విహరిస్తుంటే  మనసు ఆనందంగాను ఒక్కోసారి విచారంగాను ఉంటుంది. దేనికోసం ఈ పయనం నా గూటిని వదిలి ఇంకొక చోట గూడు కట్టుకొని తిండ వెతుక్కోవటనికా, నా దంటు ఏది లేని ఈ దేశం లో దేనికోసం ఈ ఆరాటం. పోనీ అలా అనుకుంటే జీవితం ఏది ఎవరు శాస్వతం కాదు  ,వచ్చామా , పెరిగామ ,పోయామ ? ఎక్కడికి పోతే ఏంటి ? ఎటు ఉంటె ఏంటి?
సగానికి పైగా గడచినది, ఇంకు మిగిలిన సగమే భయము పుట్టిస్తుంది.

ఆప్యాయంగా  పలకరింపులు లేవు, ఎవరు ఏంటో తెలీదు, పక్కన ఇంట్లో ఎవరు ఉన్నారో కూడా తెలియదు.
నేను places  మారుతున్నననే కాని నా దిన చర్యలో మార్పు లేదు. అదే ఇండియా లో Weather  గురించి భయం లేదు . ఎక్కడ చూసిన జనాలే, మనము కలుపుకొని పోవాలె కాని ఒకటి బట్టి 4 సార్లు చూస్తే వల్లే మనల్ని పలకరిస్తారు గుర్తిస్తారు.కాని cities లో మారిపోయింది. అంత ఉరుకులు పరుగులే.సగం జీవితం travelling సరిపోతోంది. పక్కన వారికి ఇంట్లో ఉన్న భార్య కు సమయం కేటాయించటం కష్టమయిపోయింది.అలా చూస్తే అమెరికా లో 8 గంటల పని weekends  ఖాళి. అయిన పలరించటానికి చుట్టూ పక్కల వాళ్ళు లేకపోతే ఇంత టైం ఏమి చేసుకోము ? ఇక్కడ ఒంటరితనము. విషాదం. నా పిల్లలను ఎక్కడ పెంచాలో  ఈ మారుతున్న కాలానికి తగ్గటు ఎలా వారికి నేర్పించాలో తెలియదు, నాకు తెలిస్తే నేను చెప్పగలను. జీవిత సమరంలో సైనికులుగా చెయ్యాలో ? ఏమో ఎవరికీ తెలుసు. వారినే వారి చుట్టూ ఉన్న వాటినుండి నేర్చుకోవటానికి వదిలేయ్యాలో? తెలియదు. చిన్నప్పుడే మేలు ఏదో చదువు ,పరిక్షలు, సెలవులు.మరి seat వహ్చ్చిండా చదివామ ఒక్కటికూడా ఫెయిల్ అవ్వకుండా అంతే , job అంతే interview  లో వహ్సిండా success య్యమ అంతే, ఇదేంటి జీవితం రా పొద్దున్న లేచినప్పటి నుండి పరీక్షనే. అందరు తిన్నార ఉన్నారా ఏమి చేస్తున్నారు, ఎటుపోతున్నారు,  ఇల్లాలి జీవితం అంతే నేమో. ఒకటే పరుగు. చచ్చేదాకా ఒకటే పరుగు ఈ పరుగు ఇండియా అయితేనేమి అమెరికా అయితేనేమి.

----------------------------------పరిసమాప్తము  --------------------------------------------